Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??

కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి చేరారు.

Guru Charan Singh (Credits: X)

Newdelhi, May 18: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ (Guru Charan singh) ఎట్టకేలకు ఇంటికి చేరారు. గతనెల 22న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఆచూకీ తెలియలేదని కుటుంబసభ్యులు పోలీసులకు (Police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంత గాలించినా సింగ్ ఆచూకీ తెలియరాలేదు. అయితే, శుక్రవారం అనూహ్యంగా ఆయన ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులతో పాటు ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. కాగా, ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా దేశంలోని ప్రముఖ గురుద్వారాలను తాను ఏకాంతంగా సందర్శించినట్టు సింగ్ చెప్పడం కొసమెరుపు.

త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. గతవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పవిత్ర జయరాంతో ఆరేండ్లుగా సహజీవనం.. ఇటీవలే యాక్సిడెంట్‌ లో పవిత్ర మృతి.. పవిత్ర పిలుస్తున్నదంటూ రెండ్రోజుల క్రితం పోస్ట్.. ఇంతలోనే సూసైడ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement