Haryana Lockdown: మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు, పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న హర్యానా ప్రభుత్వం, లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ నెల 3 నుంచి 10 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఆ తరువాత 10 నుంచి 17 వరకు పొడిగించింది.

Lockdown in Goa (Photo Credits: PTI)

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ నెల 3 నుంచి 10 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఆ తరువాత 10 నుంచి 17 వరకు పొడిగించింది. నిబంధనల మేరకు రేపటితో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఒక్కరోజే హర్యానాలో 9వేలకుపైగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 144 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్‌ కేసులు 6.85 లక్షలకు చేరాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement