CBSE 12th Result 2023 Declared: విద్యార్థులకు అలర్ట్, సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల, మొదటి స్థానంలో తిరువనంతపురం, చివరి స్థానంలో ప్రయాగ్‌రాజ్‌

శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

Representational Image (File Photo)

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16.9లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

జూన్ 14 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలదే పై చేయి, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఫెయిలైన విద్యార్థులకు మంత్రి మనవి

ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత 87.33 శాతంగా ఉందని బోర్డు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, ఈ ఫలితాల్లో తిరువనంతపురం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 99.91 శాతం విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయాగ్‌రాజ్‌ 78.05 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.