CBSE 10th Results 2022 Declared:సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాలు విడుదల, ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస్, అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ పాస్

ఈ ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస‌య్యారు. అయితే టెన్త్‌లో అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే రోజు టెన్త్‌, 12 త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను రిలీజ్ చేసింది.

Representational Image | File Photo

సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాల‌ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస‌య్యారు. అయితే టెన్త్‌లో అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే రోజు టెన్త్‌, 12 త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ను రిలీజ్ చేసింది. 10వ త‌ర‌గ‌తిలో అమ్మాయిలు 95.21 శాతం పాస‌య్యారు. అబ్బాయిలు 93.80 శాతం పాసైన‌ట్లు బోర్డు తెలిపింది. సుమారు 64,908 మంది విద్యార్థులు 95 శాతం క‌న్నా ఎక్కువ మార్క్‌లు స్కోర్ చేశారు. 2.36 ల‌క్ష‌ల మంది విద్యార్థులు 90 శాతం క‌న్నా ఎక్కువ మార్క్‌లు స్కోర్ చేశారు. 1,07,689 మంది విద్యార్థులు కాంపార్ట్‌మెంట్‌లో ఉండిపోయారు.