NEET PG 2021 Exam Postponed: నీట్‌ పీజీ పరీక్ష నాలుగు నెలల పాటు వాయిదా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం

ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘ నీట్‌ పీజీ పరీక్షను దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. ఈ ఏడాది ఆగస్ట్‌ 31న పరీక్ష నిర్వహించలేము.

Representational Image (Photo Credits: PTI)

నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘ నీట్‌ పీజీ పరీక్షను దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. ఈ ఏడాది ఆగస్ట్‌ 31న పరీక్ష నిర్వహించలేము. ఎగ్జామ్‌ డేట్‌ ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఒక నెల రోజులు వ్యవధి ఇస్తాం. ఆ తర్వత పరీక్ష నిర్వహిస్తాం. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది క్వాలిఫైడ్‌ డాక్టర్లు కోవిడ్‌ విధి నిర్వహణలో పాల్గొనే అవకాశం లభిస్తుంది’’ అన్నారు. కరోనా కట్టడికి తగినంత మంది వైద్యుల లభ్యత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనివల్ల కోవిడ్ డ్యూటీ నిర్వహించే వైద్య సిబ్బంది లభ్యత గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు