India Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం, కొత్తగా 68 వేల కరోనా కేసులు, 291 మంది మృతితో 1,61,843కు చేరుకున్న మరణాల సంఖ్య, 5,21,808 యాక్టివ్ కేసులు

దేశంలో గ‌త 24 గంటల్లో 68,020 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 32,231 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు (Coronavirus in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,843కు పెరిగింది.

Coronavirus in India (Photo-PTI)

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,55,993 మంది కోలుకున్నారు. 5,21,808 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,05,30,435 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కొత్తగా 68 వేల కరోనా కేసులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement