Aadhaar Update: ఆధార్ కార్డ్ వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు రేపే చివరి తేదీ, యూజర్లను అలర్ట్ చేసిన యూఐడీఏఐ
యూఐడీఏఐ ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘మై ఆధార్’ను సందర్శించాల్సి ఉంటుంది.
ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా ఆధార్ కార్డ్‌లోని వివరాల్ని అప్‌డేట్ చేసుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (uidai) ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. యూఐడీఏఐ ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ‘మై ఆధార్’ను సందర్శించాల్సి ఉంటుంది.
యూఐడీఏఐ ట్వీట్ మేరకు.. ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకొని పదేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలైందా? అయితే మార్చి 15 నుంచి జూన్ 14, 2023 వరకు ఉచితంగా https://myaadhaar.uidai.gov.inలో ఐడెంటిటీ ఫ్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవాలని ట్వీట్ చేసింది. దీంతో యూఐడీఏఐ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. గడువు అనంతరం యధావిధిగా డబ్బులు చెల్లించి ఆధార్‌ను ఆప్‌డేట్ చేసుకోవచ్చు.
Here's UIDAI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)