AP EAPCET Exam Date: విద్యార్థులకు అలర్ట్, మే 15 నుంచి ఏపీఈఏపీసెట్‌, మే 5న ఈసెట్, మే 24, 25 తేదీల్లో ఐసెట్‌, షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి

ఏపీలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

Representative Image (Photo Credit: PTI)

ఏపీలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీసెట్‌ (ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌), లేటరల్‌ ఎంట్రీ (డిప్లమా విద్యార్థులు ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశం)కి సంబంధించిన ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్‌ నోటిఫికేషన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ వివరాలను ఉన్నత విద్యా మండలి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈఏపీసెట్‌ పరీక్షలను మే 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈసెట్‌ మే 5న, ఐసెట్‌ మే 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు.

AP EAPCET Exam Date

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now