Diabetes- Insurance Claim: మధుమేహం ఉందంటూ బీమా క్లెయిమ్ తిరస్కరించరాదు.. దక్షిణ కన్నడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
మధుమేహం పేరుచెప్పి బీమా క్లెయిమ్ ను బీమా కంపెనీ తిరస్కరించరాదని దక్షిణ కన్నడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది.
Newdelhi, Jan 30: మధుమేహం (Diabetes) పేరుచెప్పి బీమా క్లెయిమ్ ను (Insurance Claim) బీమా కంపెనీ తిరస్కరించరాదని దక్షిణ కన్నడ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్పింది. అసలేం జరిగిందంటే.. బజాజ్ అలయెన్స్ నుంచి రాజీవ అనే వ్యక్తి మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. శ్వాస సమస్యలతో ఆయన ఏడాదిన్నర కిందట దవాఖానలో చికిత్స పొందారు. దీని కోసం రూ.48,872 ఖర్చు చేశారు. ఈ సొమ్మును భర్తీ చేయాలని బీమా కంపెనీని కోరారు. దీనిపై కంపెనీ స్పందిస్తూ, ఆయన 27 ఏండ్ల నుంచి మధుమేహంతో బాధపడుతున్నారని సాకు చెప్తూ చికిత్స ఖర్చులను భర్తీ చేసేందుకు తిరస్కరించింది. దీంతో రాజీవ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన కమిషన్ పై విధంగా తీర్పు చెప్పింది. చికిత్స ఖర్చులతో పాటు పిటిషన్ దారుకు అదనంగా రూ. 15 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)