Lunar New Year 2025: చాంద్రమాన నూతన సంవత్సరం(లూనార్ న్యూ ఇయర్‌) ..గూగుల్ డూడుల్ సెలబ్రేట్, ఏఏ దేశాల్లో జరుపుకుంటారో తెలుసా!

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ డూడుల్(Google Doodle). ఇవాళ లూనార్ న్యూ ఇయర్‌(Lunar New Year 2025)ను జరుపుకుంది.

Google Doodle celebrates Happy Lunar New Year 2025!(Google)

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్ డూడుల్(Google Doodle).. ఇవాళ లూనార్ న్యూ ఇయర్‌(Lunar New Year 2025)ను జరుపుకుంది. చాంద్రమాన క్యాలెండర్‌లో మొదటి అమావాస్యను ఆసియాలోని అనేక దేశాలలో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఆచారం 3,000 సంవత్సరాలుగా అనాదిగా వస్తోంది.

తూర్పు ఆసియాలో ఎక్కువ భాగం చైనీస్ క్యాలెండర్ ఆధారంగా లూనిసోలార్ న్యూ ఇయర్‌ని(Lunar New Year ) జరుపుకుంటారు . పాశ్చాత్య ప్రపంచంలో సాధారణంగా చాంద్రమాన నూతన సంవత్సరం గా సూచిస్తారు. చైనాలో లూనార్ సంవత్సరం సందర్భంగా అధికారికంగా సెలవు దినం.

12 నెలల తర్వాత వచ్చే ఈ తొలి అమావాస్యను వేడుకగా జరుపుకుంటారు. తమ ఇంటిని శుభ్రపరిచి ఎర్ర రంగుతో అలంకరిస్తారు. ప్రజలు దీపాలను వెలిగిస్తారు. తమ కుటుంబ సభ్యులతో వేడుకగా లూనార్ ఈయర్‌ను జరుపుకుంటారు. చేప, కోడి మాంసం, ముద్దపప్పు, స్వీట్ రైస్ కేకులు, పండ్లు వంటి వివిధ రకాల వంటకాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తారు.

Google Doodle celebrates Lunar New Year 2025

Google Doodle celebrates Lunar New Year 2025(Google)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement