Corona Nasal Vaccine: హెటిరోలోగస్ బూస్టర్ నాసల్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి.. తొలుత ప్రైవేట్ హాస్పిటల్స్ లో అందుబాటులోకి..

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, అత్యవసర ఉపయోగం కోసం కొత్త నాసల్ కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Representational image (Photo Credit- Twitter)

Newdelhi, Dec 23: దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల (Corona Cases) దృష్ట్యా, అత్యవసర ఉపయోగం కోసం కొత్త నాసల్ కరోనా వ్యాక్సిన్‌ (Nasal Vaccine) ను కేంద్రం ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పుడు ప్రజలు ఇంజెక్షన్ చేయవలసిన అవసరం లేదు. ముక్కులో (Nose) చుక్కలు వేయడం ద్వారా ఈ కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందిస్తారు. తొలుత ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇది లభించనుంది. వ్యాక్సినేషన్ ప్రోగ్రాం లో దీన్ని భాగం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదో హెటిరోలోగస్ బూస్టర్ వ్యాక్సిన్. అంటే, గతంలో ఏ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, బూస్టర్ డోసుగా దీన్ని వేసుకోవచ్చు.

బయటి దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేయండి.. ఆరోగ్య శాఖ కరోనా తాజా మార్గదర్శకాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)