Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు
ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి నైరుతి రుతుపవన సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
Newdelhi, Apr 16: ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) (IMD) రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి నైరుతి రుతుపవన (Monsoon Season) సీజన్ లో సాధారణం కంటే అధిక వర్షపాతం (Rains) నమోదవుతుందని అంచనా వేసింది. ఆగస్టు-సెప్టెంబరు నాటికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి తెలిపారు. ప్రైవేటు వాతావరణ సంస్థ సైమెట్ కూడా రుతుపవనాల సీజన్ వర్షాలపై ఇటీవల ఇలాంటి అంచనాలనే వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)