Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ప్రయాణికుల కోసం 968 స్పెషల్ ట్రైన్స్, ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని తెలిపిన రైల్వే శాఖ
ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే పేర్కొంది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
IRCTC రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే పేర్కొంది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 968 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త రైళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, మన్మాడ్ మధ్య 126 రైళ్లు ఉన్నాయి. మాల్దా టౌన్, రేవా మధ్య దాదాపు ఆరు వేసవి స్పెషల్స్ ప్రయాణించనున్నాయి. దాదర్, మడ్గావ్ మధ్య మరో ఆరు వేసవి స్పెషల్స్ నడుస్తాయి. ఇక, తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.
హైదరాబాద్-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.అదేవిధంగా తిరుపతి-హైదరాబాద్ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ చేరకుంటుంది. ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మరోవైపు.. తిరుపతి-ఔరంగాబాద్ (07511) స్పెషల్ ట్రెయిన్ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)