Low Pressure in Bay of Bengal: వెదర్ అలర్ట్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం, రాగల 24 గంటల్లో శ్రీలంక తీరానికి సమీపంలోకి..
భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు (గురువారం) వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.
భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు (గురువారం) వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి చేరువలోకి వస్తుందని ఐఎండీ వివరించింది.
కాగా, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన పిమ్మట దక్షిణ కోస్తాంధ్రపైనా ప్రభావం చూపుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థల వెదర్ మోడల్స్ చెబుతున్నాయి. కాగా, అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని ఐఎండీ పేర్కొంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)