Group-1 Posts Increases: గ్రూప్ 1లో కొత్తగా పెంచిన పోస్టుల వివరాలు ఇవిగో, మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది

Telangana Govt Logo

తెలంగాణ ప్రభుత్వం మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది.ఆర్థిక, హోం, లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌, పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌డెవలప్‌మెంట్‌, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లలో వివిధ పోస్టులు కలిపి మొత్తం 60 పోస్టులను పాత నోటిఫికేషన్‌కు జత చేస్తూ మూడో తేదీన నిర్ణయం తీసుకుంది.

గతేడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా.. దాదాపు 2.32లక్షల మంది హాజరయ్యారు.పేపర్‌ లీకేజీల వ్యవహారం వెలుగు చూడడంతో ఎగ్జామ్‌ రెండుసార్లు రద్దుకాగా.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం, ఇతరత్రా పరీక్షల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు