ICC T20 World cup 2022: పాకిస్తాన్ బౌలర్‌కి సలహాలిచ్చిన భారత్ బౌలర్ షమీ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
నెట్స్ లో బౌలింగ్ సాధన చేస్తున్న టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ వద్దకు పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదీ వచ్చాడు. దాయాది బౌలర్ ను షమీ ఉత్సాహంగా పలకరించాడు.
టీ20 వరల్డ్ కప్ కోసం ప్రధాన జట్లన్నీ ఆస్ట్రేలియా చేరుకుని సన్నాహాలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో, మైదానంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. నెట్స్ లో బౌలింగ్ సాధన చేస్తున్న టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ వద్దకు పాకిస్థాన్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిదీ వచ్చాడు. దాయాది బౌలర్ ను షమీ ఉత్సాహంగా పలకరించాడు. ఈ సందర్భంగా షహీన్ అఫ్రిది... షమీని కొన్ని బౌలింగ్ మెళకువల గురించి అడగ్గా, షమీ కాదనకుండా అఫ్రిదీకి సలహాలు ఇవ్వడం సోషల్ మీడియాలో ఫొటోల రూపంలో దర్శనమిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పంచుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)