‘BJP MPs Pushed Me’: వీడియో ఇదిగో, బీజేపీ ఎంపీలే త‌న‌ను నెట్టివేశారు, తోపులాటపై స్పందించిన రాహుల్ గాంధీ, పార్ల‌మెంట్ లోప‌లికి వెళ్ల‌కుండా నన్ను అడ్డుకున్నారని వెల్లడి

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. అంబేద్క‌ర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. నేడు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న చేప‌ట్టారు.

Rahul Gandhi (Photo-ANI)

Chaos Outside Parliament: పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. అంబేద్క‌ర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. నేడు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న చేప‌ట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీని వ్య‌తిరేకిస్తూ.. బీజేపీ ఎంపీలు కూడా ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ నేపథ్యంలోనే పార్ల‌మెంట్‌లోని మ‌క‌ర ద్వారం తోపులాట జ‌రిగింది. ఆ ఘ‌ర్ష‌ణ‌లో బీజేపీ ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయ‌ప‌డ్డారు.

వీడియో ఇదిగో, పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లకు గాయాలు, అంబేద్క‌ర్‌పై అమిత్ షా చేసిన వాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి డిమాండ్

ఈ ఘటనపై సారంగి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఇద్దరమూ కిందపడడంతో తన తలకు గాయమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తోసేయడం వల్లనే తాను కిందపడ్డానని సారంగి చెప్పారు.దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలు త‌న‌ను నెట్టివేశార‌ని, పార్ల‌మెంట్ లోప‌లికి వెళ్ల‌కుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు. కానీ రాహుల్ గాంధీ తోయ‌డం వ‌ల్లే ఎంపీల‌కు గాయ‌మైన‌ట్లు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు.

Rahul Gandhi Reacts After Pratap Sarangi Blamed Him

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement