Kannappa Update: ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు, కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్
ఈ సినిమాలో శివుడి పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ త్రిశూలం, ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై 'ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు' అని రాశారు.
మంచు విషు ప్రధాన పాత్రలో, ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పలువురి పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేశారు. 'కన్నప్ప' టీజర్ కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాలో శివుడి పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ త్రిశూలం, ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై 'ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు' అని రాశారు. 'కన్నప్ప' సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తుంటే.. పార్వతి దేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె పార్వతి దేవి లుక్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ వేసవిలో ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Akshay Kumar as Lord Shiva in Actor’s Telugu Debut Unveiled
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)