Gujarat Earthquake: గుజరాత్‌లో భూకంపం, రాజ్‌ కోట్‌కు సమీపంలో భూకంప కేంద్రం, ఎలాంటి నష్టం లేదన్న అధికారులు

గుజరాత్ లోని రాజ్ కోట్ (Rajkot) పరిసర ప్రాంతాల్లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.3గా (4.3 Magnitude) నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాజ్‌ కోట్ కు 270 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.21 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్‌మొలాజి (NCS) ప్రకటించింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Rajkot, FEB 26: గుజరాత్ లోని రాజ్ కోట్ (Rajkot) పరిసర ప్రాంతాల్లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.3గా (4.3 Magnitude) నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాజ్‌ కోట్ కు 270 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.21 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్‌మొలాజి (NCS) ప్రకటించింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల టర్కీ, సిరియాల్లో భూకంపం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గుజరాత్ కు భూకంప ముప్పు ఉందన్న వార్తలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement