COVID Hospital Fire: కొవిడ్‌ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం, నలుగురు మృత్యువాత, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు సంతాపం

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగి నలుగురు మృత్యువాతపడ్డారు. అదే సమయంలో హాస్పిటల్‌లో ఉన్న 27 మంది రోగులను మరో ఆస్పత్రికి తరలించినట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Fire (Representational image) Photo Credits: Flickr)

నాగ్‌పూర్‌ వాడి పరిసరాల్లోని ప్రైవేటు ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా.. 15 ఐసీయూ పడకలు ఉన్నాయి. ఆస్పత్రి రెండో అంతస్థులో ఐసీయూ ఏసీ యూనిట్‌ నుంచి మంటలు మొదలయ్యాయి. తర్వాత వార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే మంటలు రెండో అంతస్తుకే పరిమితమయ్యాయి.

మిగతా అంతస్తులకు వ్యాపించకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజేంద్ర ఉచ్కే పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పినట్లు చెప్పారు. హస్పిటల్ లో కొవిడ్‌ రోజులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

మృతులకు కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌ కలెక్టర్‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement