Bihar: సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నా.. కల్తీ మద్యం తాగి ఆరు మంది మృతి, మరో నలుగురు ఆస్పత్రిలో..బీహార్ లో విషాద ఘటన

బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న సంగతి విదితమే. అయితే తాజాగా బీహార్ లో కల్తీ మందు తాగి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Relative of the deceased died (Photo/AN)

బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న సంగతి విదితమే. అయితే తాజాగా బీహార్ లో కల్తీ మందు తాగి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించి వారం రోజులు కాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement