Elderly Passenger Dies in Mumbai Airport: ముంబై ఎయిర్ పోర్టులో గుండెపోటుతో వృద్ధుడు మృతి, వీల్ చైర్ ఆలస్యం కారణంగా నడుచుకుంటూ వెళ్లడంతో హార్ట్ ఎటాక్

న్యూయార్క్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిని వీల్‌చైర్‌ అడిగాడు. అయితే వీల్‌చైర్లకు భారీ డిమాండ్‌ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కోరారు.

Air India Representational Image (File Photo)

ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిని వీల్‌చైర్‌ అడిగాడు. అయితే వీల్‌చైర్లకు భారీ డిమాండ్‌ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కోరారు.

దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ వృద్ధుడు నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్‌ చెక్‌ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా సంస్థ స్పందించింది. వీల్‌ చైర్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నందున అతన్ని కొద్దిసేపే వేచి ఉండాలని మేం కోరాం. అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అతడు ఇమిగ్రేషన్‌ చెక్‌ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ముందుగా బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే వీల్‌ చైర్‌ ఇవ్వాలని మా సంస్థకు ఒక పాలసీ ఉంది’ అని ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఎయిర్‌ ఇండియా తెలిపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)