Uttarakhand Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, నదిలో కొట్టుకుపోయిన కారు, 11మందిలో తొమ్మిది మంది మృత్యువాత

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. 11 మందితో వెళ్తున్న కారు రాంనగర్ ప్రాంతంలో అదుపుతప్పి డేలా నదిలోకి దూసుకెళ్లింది. ప్రయాణికుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. బాధితులందరూ పంజాబ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

Uttarakhand Road Accident (Photo-Video Grab)

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. 11 మందితో వెళ్తున్న కారు రాంనగర్ ప్రాంతంలో అదుపుతప్పి డేలా నదిలోకి దూసుకెళ్లింది. ప్రయాణికుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. బాధితులందరూ పంజాబ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. మొత్తం 11 మంది ప్రయాణికుల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు.

మిగతా 9 మందీ చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. కార్బెట్ జాతీయ పార్కులోని ధేలా జోన్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. వేగంగా దూసుకెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారని పేర్కొన్నారు. అలా వెళ్లిన కారు ధేలా గ్రామంలోని నదిలో బలమైన ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు వివరించారు. కాగా, ఇక్కడ గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. దీంతో నదిపై వంతెన నిర్మించాలన్న చర్చలు జరుగుతున్నాయి. అంతలోనే ఇక్కడ మరో ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now