Weather Forecast: బయటకు రావొద్దు, దేశంలో 3 నెలల పాటు వడగాడ్పులు, అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక
దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ స్థాయి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది.
భారత్‌లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం హెచ్చరించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ స్థాయి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. ఈ మూడు నెలల కాలంలో మధ్య, తూర్పు, వాయవ్య భారత్‌లోని మెజారిటీ ప్రాంతాల్లో ఎక్కువ రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే ముప్పు ఉన్నదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)