SC on Calcutta HC Verdict: అమ్మాయిలు లైంగిక కోరికలు అణుచుకోవాలనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం

యవ్వన దశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.

Supreme Court. (Photo Credits: Wikimedia Commons

యవ్వన దశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకోకుండా గౌరవ హోదాలో ఉన్న న్యాయవాదులు ఇలాంటి తీర్పులలో తమ సొంత అభిప్రాయాలను చొప్పించడం సబబు కాదని సూచించింది.ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 12న జరుగనున్నది.

పశ్చిమబెంగాల్‌లో 14 ఏళ్ళ బాలిక అత్యాచారం కేసులో కౌమార దశలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను అదుపులో పెట్టుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. రెండు నిమిషాల సుఖం కోసం బాలికలు పరాజితులుగా మిగిలిపోకూడదని సలహా ఇచ్చింది. అంతేగాక నిందితుడికి ట్రయల్‌ కోర్టు విధించిన 20 ఏళ్ల జైలుశిక్షను రద్దు చేసింది.

Here's Live Law News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now