Coronavirus in India: దేశంలో గడిచిన 24గంటల్లో 12,885 మందికి కరోనా, తాజాగా 15,054 మంది బాధితులు కోలుకోని డిశ్చార్జ్

దేశంలో గడిచిన 24గంటల్లో 12,885 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 15,054 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 461 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,48,579 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

Coronavirus in US (Photo Credits: PTI)

దేశంలో గడిచిన 24గంటల్లో 12,885 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 15,054 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 461 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,48,579 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,43,21,025కి చేరగా.. ఇప్పటి వరకు 3,37,12,794 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 4,59,652 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో టీకా డ్రైవ్‌ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 1,07,63,14,440 డోసులు టీకాలు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now