Actress Jaya Prada: జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు, కార్మికులకు ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించలేదని కేసు పెట్టిన కార్మిక బీమా కార్పోరేషన్‌

సీనియర్‌ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది.దీంతో పాటుగా జరిమానా కూడా విధించింది

Jaya Prada (Photo-Insta)

సీనియర్‌ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది.దీంతో పాటుగా జరిమానా కూడా విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే...చెన్నైకి చెందిన రామ్‌ కుమార్‌, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్‌ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్‌లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది.

దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది.

Jaya Prada (Photo-Insta)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now