Delhi Coronavirus: ఆక్సిజన్ లేదు..కొత్త పేషెంట్లు మా ఆస్పత్రికి రాకండి, దేశ రాజధాని ఢిల్లీలో ఆస్పత్రి ఎదుట కనిపిస్తున్న బోర్డులు, ఎయిమ్స్‌లోనూ ఆక్సిజన్ కొరత కారణంగా కొత్త కరోనా రోగులకు నో ఎంట్రీ

ఆక్సిజన్ కొరత నేపధ్యంలో పలు ఆసుపత్రులలో కరోనా బాధితులను చేర్చుకోవడం లేదు. దీంతో బాధితులు ప్రాణాలను ఉగ్గబట్టుకుని పలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

Coronavirus in India | (Photo Credits: PTI)

ఢిల్లీలోని జీటీబీ, సరోజ్, జైపూర్ గోల్డెన్, మెట్రో, సర్ గంగారామ్, ఫోర్టీస్ ఎస్కోర్ట్ తదితర ఆసుపత్రులలో కొత్తగా కరోనా బాధితులను చేర్చుకోవడం లేదు. ఇదేవిధంగా చిన్న స్థాయి నర్సింగ్ హోమ్‌లలోనూ కొత్తగా కరోనా బాధితులెవరినీ చేర్చుకోవడం లేదు. పైగా బాధితులు ఇంటిలోనే తగిన రీతిలో వైద్య చికిత్స పొందాలని ఆయా ఆసుపత్రుల వైద్యులు సూచిస్తున్నారు. ఢిల్లీలో పెద్దాసుపత్రిగా పేరొందిన ఎయిమ్స్ లోనూ ఆక్సిజన్ కొరత కారణంగా కొత్తగా కరోనా బాధితులెవరినీ చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.