Agnipath Recruitment Row: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో మిన్నంటిన నిరసనలు, ఆందోళనకారులను అదుపుచేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
ఆర్మీలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్‌కు వ్యతిరేకంగా బీహార్ యువత కదం తొక్కింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నవాడ, జహానాబాద్, ముంగర్, ఛాప్రాలో పెద్దఎత్తున యువత రోడ్లు ఎక్కారు.
ఆర్మీలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ రిక్రూట్‌మెంట్‌కు వ్యతిరేకంగా బీహార్ యువత కదం తొక్కింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నవాడ, జహానాబాద్, ముంగర్, ఛాప్రాలో పెద్దఎత్తున యువత రోడ్లు ఎక్కారు. అర్రాహ్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా కాస్తా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసన కారులు రైల్వే ట్రాక్‌పై టైర్లు, కర్రలు ఉంచారు. దీంతో రైళ్ల రాకపోకలు అంతరాయం కలిసింది. రైల్వే స్టేషన్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
జహానంద్‌లో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. నవాడాలో రోడ్లపై టైర్లు కాల్చివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, నాలుగేండ్లు పనిచేసినతర్వాత తామేం చేయాలి అని ఓ యువకుడు ప్రశ్నించారు. నాలుగేండ్ల సర్వాత తర్వాత మేం ఉపాధి కోల్పోయి రోడ్లపై పడుతాంమని ఆవేదన వ్యక్తం చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)