AIMPLB President Dies: ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ కన్నుమూత, ముస్లిం విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం విశేష కృషి
ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ రాబే హసానీ నద్వి(94) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నద్విని చికిత్స కోసం రాయ్‌బరేలీ నుంచి లక్నోకు తరలించారు. అయితే దాలిగంజ్‌లోని నద్వా మదరాసాకు ఆయన్ని తరలించగా.. అక్కడే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.
ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ రాబే హసానీ నద్వి(94) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నద్విని చికిత్స కోసం రాయ్‌బరేలీ నుంచి లక్నోకు తరలించారు. అయితే దాలిగంజ్‌లోని నద్వా మదరాసాకు ఆయన్ని తరలించగా.. అక్కడే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. సున్నీ ఇస్లామిక్ స్కాలర్ అయిన నద్వి.. ముస్లిం విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం విశేష కృషి చేశారు.
ఉత్తర ప్రదేశ్ రాయ్‌బరేలీ టాకియా కలాన్‌లో జన్మించిన రబే హసానీరాబే హసానీ నద్వి.. 2018 నుంచి ఏఐఎంపీ చీఫ్‌గాను పని చేస్తూ వచ్చారు. దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా ఛాన్సలర్‌గా పని చేశారు. విద్యా రంగానికి నద్వి అందించిన సేవలకు మంచి పేరు దక్కింది. యూపీ ప్రభుత్వం నుంచి పలు ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు అరబిక్ భాషకు, సాహిత్యానికి చేసిన కృషికిగానూ రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. నద్వి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.
Here's AIMPLB Tweet