Akhilesh Yadav Covid: యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కరోనా, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడి, హరిద్వార్ లోని మహాకుంభమేళాలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్

ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఫలితంగా సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నానని చెప్పారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించారు.

Akhilesh Yadav (Photo Credits: Twitter)

గత కొన్ని రోజులుగా తనతో టచ్ లో ఉన్నవారంతా కరోనా (COVID-19 Outbreak) టెస్టులు చేయించుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నానని అఖిలేష్ తన సందేశంలో పేర్కొన్నారు. అంతేకాదు, వాళ్లంతా కొన్ని రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని ఆయన అభ్యర్థించారు. కాగా, ఇటీవలే హరిద్వార్ లోని మహాకుంభమేళాలో అఖిలేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా, కుంభమేళా ప్రాంతంలోని కరోనా క్యాంపుల్లో చేసిన టెస్టుల్లో గత రెండు రోజుల్లో వెయ్యిమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం విశేషం.

Here's Akhilesh Yadav Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)