Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్, కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ రాలేకపోయారని వెల్లడి

సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు

Allu Aravind (photo-Video Grab)

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మృతిచెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తెలిపారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ రాలేకపోయారు. అర్జున్‌ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని తెలిపారు.

వీడియో ఇదిగో, శ్రీతేజ్‌కు ఆక్సిజన్‌ అందక బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది, 13 రోజులుగా చికిత్స కొనసాగుతుందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చైతన్, విష్ణుతేజ్ నిన్న రాత్రి వెల్లడించారు. ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉన్నట్లు చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని, బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు.

Allu Aravind visited Sritej who was injured in the Sandhya Theater incident

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif