Pushpa-2 Stampede Incident: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినాతో కలిసి గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ..‘‘13 రోజులుగా బాలుడికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

డిసెంబరు 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్‌కు ఆక్సిజన్‌ అందక బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయింది. వెంటిలేటర్‌ సాయంతో ఆక్సిజన్‌ అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్‌ విడుదల చేస్తారు’’ అని సీపీ తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Hyderabad City Police Commissioner CV Anand visits KIMS Hospital

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)