Amritsar Horror: షాకింగ్ వీడియో ఇదిగో, కన్న కూతుర్ని చంపి శవాన్ని బైక్‌కు కట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తండ్రి, వైరల్ అవుతున్న సీసీ టీవీ పుటేజీ
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో కుమార్తెను దారుణంగా హత్య చేసిన తండ్రి ఆపై ఆమె శవాన్ని బైక్‌కు కట్టి డంపింగ్ యార్డ్ వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కుమార్తె తీరుపై అనుమానంతో అతడీ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో కుమార్తెను దారుణంగా హత్య చేసిన తండ్రి ఆపై ఆమె శవాన్ని బైక్‌కు కట్టి డంపింగ్ యార్డ్ వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కుమార్తె తీరుపై అనుమానంతో అతడీ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత పదునైన ఆయుధంతో ఆమెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తాడుతో బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు.
ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అయితే, హత్యకు గల కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.కాగా ఆమె ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బుధవారం ఇంటి నుండి బయటకు వెళ్లి మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో తండ్రి అనుమానంతో హత్య చేసినట్లు సమాచారం. కెమెరా ఫుటేజ్‌లో ఒక వ్యక్తి ఒక మహిళ మృతదేహాన్ని కట్టివేసి కఠినమైన గ్రామ రహదారిపై మోటారుసైకిల్‌పై వెళుతున్నట్లు చూపిస్తుందని పోలీసులు తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)