Pawan Kalyan on Movies: వీడియో ఇదిగో, ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యింది, టాలీవుడ్ సినిమా హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, ఆ హీరోని టార్గెట్ చేశారా..

ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్నాడు.

Andhra Pradesh Deputy CM Pawan Kalyan Shocking Comments on Tollywood Movie heroes

సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు  స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. రాజ్ త‌రుణ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు, పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపిన తెలంగాణ‌ హైకోర్టు

ఒక్క సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం. అది బయటికి మంచి మెసేజ్ ను ఇవ్వలేదు ’ అని పవన్‌ అన్నారు.పవన్‌ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ గందపు చెక్కలు స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిగా నటించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.ఈ చిత్రం బన్నీకి జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)