Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు, శభాష్ పోలీసన్న అంటూ నెటిజన్ల ప్రశంసలు
నీరు తెచ్చుకునేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ వృద్దురాలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. రక్షించాలని ఆమె కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెంటనే ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు
ఏపీలోని నంద్యాల జిల్లా ముష్టపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. నీరు తెచ్చుకునేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ వృద్దురాలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. రక్షించాలని ఆమె కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెంటనే ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇద్దరు ఈతగాళ్లు, చీరల సాయంతో వృద్ధురాలని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పోలీసులు వృద్దురాలి ప్రాణాలను రక్షించారు.దీంతో స్థానికులు పోలీసులను, ఈతగాళ్లను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రమాదం జరిగిన తీరును , వృద్ధురాలిని రక్షించిన తీరును పొలీసులు వివరించారు.
Police rescued an old woman who accidentally fell into a well
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)