Hijab Burning in Kerala: కేరళలో హిజాబ్‌లను దహనం చేసిన ముస్లిం మహిళలు, ఇరాన్ ముస్లిం మహిళలకు సంఘీభావంగా కార్యక్రమం
కేరళ ముస్లిం మహిళలు ఇరాన్ ఉద్యమానికి సంఘీభావంగా హిజాబ్‌లను దహనం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.కాగా భారత్‌లో ముస్లిం మహిళలు ఇలా చేయడం ఇదే తొలిసారి.
కేరళ ముస్లిం మహిళలు ఇరాన్ ఉద్యమానికి సంఘీభావంగా హిజాబ్‌లను దహనం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.కాగా భారత్‌లో ముస్లిం మహిళలు ఇలా చేయడం ఇదే తొలిసారి. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించనందుకు ఇరాన్ పోలీసుల చిత్రహింసల్లో ఆ దేశానికి చెందిన పలువురు యువతులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌తోపాటు పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ ముస్లిం మహిళలకు సంఘీభావంగా కేరళలోని కోజికోడ్‌లో కేరళ యుక్తివాది సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు ముస్లిం మహిళలు హిజాబ్‌లను దహనం చేశారు. ఇరాన్ మహిళలకు మద్దతుగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. వారికి సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. దేశంలో తొలిసారి జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)