Anupam Kher: రూ.500 నోటుపై అనుపమ్ ఖేర్ ఫోటో, ఈ కాలంలో ఏదైనా జరగవచ్చు అంటూ రాసుకొచ్చిన బాలీవుడ్ నటుడు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం నకిలీ కరెన్సీలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే నకిలీ నోట్లకు సంబంధించిన ఒక ముఠాను తాజాగా అహ్మదాబాద్ పోలీసులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే పోలీసులకు పట్టుకున్న ఆ ముఠా దగ్గరున్న నోట్లను చూసి అధికారులు షాక్ అయ్యారు. వారి వద్ద రూ.500 నోట్లలో నోట్లలో మహాత్మ గాంధీకి బదులుగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బోమ్మ ఉంది.
అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్ తాజా నివేదిక
అలాగే ఈ నోట్లపై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు. ఈ నోట్లను ఉపయోగించి బంగారం కోనడానికి ప్రయత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.60 కోట్ల విలువైన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.దీనిపై నటుడు స్పందిస్తూ.. రూ.500 నోట్లపై గాందీజీ ఫోటోకు బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ కాలంలో ఏదైనా జరగవచ్చు అంటూ రాసుకోచ్చాడు.
Here's News