Arunachal Pradesh: వాళ్లే కిడ్నాప్ చేశారా.. ఇండో-చైనా బార్డర్‌లో 19 మంది కార్మికులు గల్లంతు, వారిలో ఒకరు మృతి, గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసిన అధికారులు

ఈశాన్య భారతంలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతు అయ్యారు. అరుణాచల్ రాజ‌ధాని ఇటాన‌గ‌ర్‌కు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Parts of Kurung Kumey district

ఈశాన్య భారతంలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతు అయ్యారు. అరుణాచల్ రాజ‌ధాని ఇటాన‌గ‌ర్‌కు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దామిన్ స‌ర్కిల్ వ‌ద్ద బోర్డ‌ర్ రోడ్డు ప‌నిలో నిమ‌గ్న‌మైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపించకుండాపోవడంతో.. ఆచూకీ లేని కార్మికుల కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. కాగా చైనాతో ఉన్న వాస్త‌వాధీన రేఖ‌కు స‌మీపంలోనే ఈ కార్మికులు అదృశ్య‌మ‌య్యారు. అయితే కుమే న‌దిలో ఓ కార్మికుడి మృత‌దేహాన్ని గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. 19 మంది కార్మికులు అస్సాం నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌ట్లు కాంట్రాక్ట‌ర్ తెలిపారు. జూలై 13వ తేదీన స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement