Sunita Kejriwal Coronavirus: హోం క్వారంటైన్‌లోకి ఢిల్లీ ముఖ్యమంత్రి, కోవిడ్‌-19 బారిన పడిన కేజ్రీవాల్‌ సతీమణి సునీత, ఢిల్లీని వణికిస్తున్న కరోనావైరస్, వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో కరోనా కలకలం రేగింది. కేజ్రీవాల్ అర్ధాంగి సునీతకు కొవిడ్ పాజిటివ్ (Sunita Kejriwal Coronavirus) అని తేలింది. భార్యకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా స్వీయ నిర్బంధంలోకి (Arvind Kejriwal Goes Into Self Isolation) వెళ్లారు. ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.

Arvind Kejriwal (Photo Credits: ANI)

కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఏప్రిల్‌ 26 వరకు ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించింన సంగతి విదితమే. ఢిల్లీలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కాగా గత ఏడాది జూన్‌లో జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో కేజ్రీవాల్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

Here's IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now