Delhi Jal Board Case: మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని తెలిపిన ఆప్ నేతలు
ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.
ఢిల్లీ జల్ బోర్డు స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఇప్పటికే లిక్కర్ కేసులో సమన్లకు స్పందించని కేసులో కోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేతకు బెయిల్ ఇచ్చిందని, అయినా ఈడీ మళ్లీ ఎందుకు సమన్లు పంపిందో తెలియడం లేదని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్‌కు ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో (Delhi Jal Board Case) సోమవారం(మార్చ్ 18) తమ ముందు హాజరవ్వాలని ఆదివారం ఈడీ కేజ్రీవాల్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అంతకుముందు లిక్కర్ కేసులో ఈడీ వరుస సమన్లకు స్పందించని కేసులో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారం కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడం గమనార్హం.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)