Arvind Kejriwal Released From Tihar Jail: వీడియో ఇదిగో, తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్, కారులో నుంచి అభివాదం చేస్తూ వెళ్లిపోయిన ఢిల్లీ సీఎం
సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు, జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని ఆదేశాలు
అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు తెలిపింది. లిక్కర్‌స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)