ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
అయితే, లిక్కర్ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడొద్దని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. మీరు కూడా అంతకంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సూచించింది. 21 రోజులు కేజ్రీవాల్ జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్‌కు జూన్ 4వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు తీరస్కరించింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Here's News
Delhi excise policy case: Supreme Court says it’s passing order on grant of interim bail to Delhi CM Arvind Kejriwal till June 1. pic.twitter.com/lyOLH8qGF1
— ANI (@ANI) May 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)