ఆప్(AAP) ఓటమిపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయానికి కారణం అన్నారు(Delhi Assembly Elections).ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ లిక్కర్ స్కాం...ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసిందన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలను ఉద్దేశించి రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవన్నారు. ఈ అహంకారాన్ని అణిచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారు.. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని చెప్పారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్.. ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తాం అన్నారు. విజయం సాధించిన బీజేపీ పార్టీకి అభినందనలు తెలిపారు.బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను అని వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)