తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షాద్ర ఏరియాలో బీజేపీ తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి వస్తే చాలా బాధేస్తోందని అన్నారు. ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్‌ మాదిరి ఢిల్లీ తయారైందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఇలా అవ్వడానికి కారణం ఎవరు? గత పదేళ్లు ఎవరు పరిపాలించారని ప్రశ్నించారు. అదే ఈ పదేళ్లు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చి ఉంటే వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌ను తలదన్నేలా తయారయ్యేదని చెప్పుకొచ్చారు.

ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కాంగ్రెస్‌ తరపున రేవంత్, బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం

దేశ రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడి ప్రజలు సరైన గాలి పీల్చాలంటే.. మోదీ ఆక్సిజన్‌ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అందుకే ఢిల్లీలో ఉండే తెలుగువాళ్లు ఇంటింటికీ వెళ్లి బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని చెప్పాలని తెలిపారు.

కేజ్రీవాల్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)