Delhi, Feb 2: తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ ఢిల్లీకి(Telugu States CMs At Delhi) వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వేర్వేరుగా హస్తినకు వెళ్లనున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఇవాళ, రేపు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).
గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో ఢిల్లీలో కాంగ్రెస్ గ్యారెంటీలతో కూడిన హామీలు ఇవ్వగా వాటిని ప్రజల ముందు ఉంచనున్నారు.
ఇక ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandra Babu) సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.55కు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
సాయంత్రం 5.10కి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోనున్నారు చంద్రబాబు. రాత్రి 7 గంటలకు సహద్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఏపీ సీఎం. ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు నిలిచారు.