Assembly Election 2023 Results Live News Updates: నేడే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న కౌంటింగ్

ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం ఆదివారం వెల్లడి కానుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Assembly Election 2023 Results Live News Updates

ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం ఆదివారం వెల్లడి కానుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలు కానుంది.తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం 8.30గంటలకు నుంచి ఓటింగ్‌ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

Here's PTI Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement