Asteroid Collides with Earth: వీడియో ఇదిగో, అంతరిక్షం నుంచి నిప్పులు చిమ్ముతూ అమితవేగంతో భూమిపై పడిన గ్రహశకలం, అర్థరాత్రి సమయంలో తాకడంతో..

అంతరిక్షం నుంచి అమితవేగంతో దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం శాస్త్రవేత్తలు గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి రష్యాలోని ఓ గ్రామంలో పడిపోయింది. అయితే ఆ గ్రహశకలం చిన్నది కావడంతో ప్రాణాపాయం తప్పింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Asteroid Collides with Earth: వీడియో ఇదిగో, అంతరిక్షం నుంచి నిప్పులు చిమ్ముతూ అమితవేగంతో భూమిపై పడిన గ్రహశకలం, అర్థరాత్రి సమయంలో తాకడంతో..
Asteroid on collision course with Earth explodes over Russia

అంతరిక్షం నుంచి అమితవేగంతో దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం శాస్త్రవేత్తలు గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి రష్యాలోని ఓ గ్రామంలో పడిపోయింది. అయితే ఆ గ్రహశకలం చిన్నది కావడంతో ప్రాణాపాయం తప్పింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆకాశం నుంచి నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చిన ఈ గ్రహశకలాన్ని చూసి రష్యాలోని యకుతియా ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రష్యా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఈ గ్రహశకలం భగభగమండుతూ భూమిని తాకింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత అది ముక్కలు ముక్కలుగా విడిపోయి భూమిని ఢీకొట్టింది.

ప్రపంచదేశాలకు అమెరికా షాక్, గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకుపోయే సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించిన అమెరికా

Asteroid on collision course with Earth explodes 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement