Ayodhya Ram Mandir Chief Priest Dies: అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూత.. 20వ ఏటనే శ్రీరాముడి సేవలో, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం
అయోధ్య రామ జన్మభూమి మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు సత్యేంద్ర దాస్.
అయోధ్య రామ జన్మభూమి మందిరం(Ram Janmabhoomi temple) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు(Ayodhya Ram Mandir Chief Priest Dies). లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు సత్యేంద్ర దాస్. బీపీ, షుగర్‌తో బాధ పడుతూ ఇటీవలే ఆస్పత్రిలో చేరారు సత్యేంద్ర దాస్. ఆయన అంత్యక్రియలు అయోధ్యలోని సరయూ నది తీరంలో(Acharya Satyendra Das Funeral) నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 3న ఆయనకు గుండెపోటు రావడంతో న్యూరాలజీ వార్డ్‌లోని హెచ్డీయూలో (హై డిపెండెన్సీ యూనిట్) చేర్చారు. దీనికి తోడు షుగర్, హైపర్‌టెన్షన్ వంటి సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఆచార్య దాస్ తన 20వ ఏటనే ప్రధాన పూజారిగా నియమితులయ్యారు. ఆయన భౌతికకాయాన్ని లక్నో నుండి అయోధ్యకు తరలించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogo Adityanath) ఆచార్య దాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సత్యేంద్ర దాస్ మృతి కొలుకోలేని నష్టం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Ayodhya Ram Mandir's chief priest Acharya Satyendra Das passes away
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)