Baba Tarsem Singh Shot Dead: పట్టపగలే గురుద్వారా చీఫ్‌ను కాల్చి చంపిన ఇద్దరు దుండగులు, సీసీటీవీ దృశ్యాలు బయటకు..

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పట్టపగలే దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్‌ బాబా తర్సేమ్ సింగ్‌ను ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ఆవరణలో కాల్చి చంపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.

Live Video of Nanakmatta Gurudwara Kar Sewa Pramukh's Murder Surfaces, Bike-Borne Assailants Seen Carrying Out Killing

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పట్టపగలే దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్‌ బాబా తర్సేమ్ సింగ్‌ను ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ఆవరణలో కాల్చి చంపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఉదయం 6:30 గంటల సమయంలో గురుద్వారా ప్రాంగణంలో కుర్చీపై బాబా తర్సేమ్ సింగ్ కూర్చుని ఉండగా.. బైక్‌పై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.బాబా తర్సేమ్ సింగ్‌ను ఖతిమాలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారని ఉధమ్ సింగ్ నగర్ ఎస్‌ఎస్‌పి మంజు నాథ్ తెలిపారు. రన్‌వేపై రెండు విమానాలు దగ్గరగా రావడంతో భయపడిపోయిన ప్రయాణికులు, ఘటనలో విరిగిన ఒక విమానం రెక్క భాగం

హత్యపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని నానక్‌మట్టా ప్రాంతంలో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని, శాంతిభద్రతలను కాపాడేందుకు సహకరించాలని సిక్కు సమాజానికి పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఆలయం ధమ్ సింగ్ నగర్ జిల్లాలో రుద్రపూర్-తనక్‌పూర్ మార్గంలోని సిక్కుల పుణ్యక్షేత్రంగా ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now